Friday, October 22, 2021

నేటి రాశి ప్రభ (12-10-2021)

మేషం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. పనులలో ఆటంకాలు. వ్యయ ప్రయాసలు. మిత్రులు, కుటు-ంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మిథునం : ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటు-ంబ సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపురావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: కుటు-ంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటు-ంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందు వినోదాలు. ఉద్యోగావకాశాలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలలో ఇబ్బందులు. అనారోగ్యం.

ధనుస్సు : బంధువుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: శుభ కార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం: అనుకోని ప్రయాణాలు. ఆశ్చర్యకర సంఘటనలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

మీనం: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందు వినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News