Wednesday, November 29, 2023

ధర్మం – మర్మం : ధర్మం – మర్మం : పాపపరిహారానికై గౌతముడు ప్రార్థించిన విధానం (ఆడియోతో…)

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా పాపపరిహారానికై గౌతముడు ప్రార్థించిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గౌతమ మహర్షి తన ఆశ్రమము నుండి నిష్క్రమించదలచిన ఋషులతో తమరే శరణమని, తాను అదిలించగా పడిపోయిన గోవు వలన కలిగిన పాపము నుండి తప్పించి పవిత్రుడిని చెయ్యడానికి తగిన తరుణోపాయం సూచించమని గౌతముడు ఋషులతో వినయముగా పలికెను. ఈ గోవు మరణించినదీ లేనిదీ అని నిర్ణయించక ముందే ఏమని ఉపాయం చెప్పెదెమని విఘ్నేశ్వరుడు ప లుకగా గౌతముడు గోవు మూర్ఛపోలేదని తప్పకుండా మరణించునని, జీవించి లేచే విధానాన్ని సూచించమని ప్రార్థించెను. బ్రాహ్మణ వేషంలో ఉన్న బ్ర హ్మచారి(వినాయకుడు) వాక్యమే తమకు ప్రమాణమని అతను చెప్పిన విధంగా చేయమని ఋషులు గౌతమునికి చె ప్పిరి. విఘ్నం కలిగించ తలచిన వినాయకుడు తన ప్రతిపాదనను మునులు, గౌతమ మహర్షి కూడా అమోదించాలని పేర్కొనెను.

- Advertisement -
   

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement