Friday, October 22, 2021

దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, ప్రభన్యూస్‌: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా రామేశ్వరరావు గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయం లోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి రామేశ్వరరావుచే ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయ కుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటిఈవోలు రమేష్‌బాబు, సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News