Wednesday, December 1, 2021

చంద్రోదయ గౌరీవ్రతం అట్లతద్ది నోము

తెలుగు సంప్రదాయంలోని నోములలో అట్లతద్ది నోము విశిష్టమైనది. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తది యనాడు జరిపే వ్రతం ఇది. అట్లతద్ది నోమునే తెలుగునాట చంద్రోదయ గౌరీవ్రతం అంటారు. మన సమాజంలో ‘అట్ల’కు ఎం తో ప్రాధాన్యత ఉంది. ఈ అట్లను తయారుచేయడానికి వాడే మిను ములు ‘రాహువు’ గ్రహానికి, బియ్యం ‘చంద్రుడు’కి సంబంధిం చిన ధాన్యాలు. వీటితో తయారైన అట్లను వాయనం ఇవ్వడం వలన గర్భదోషాలు తొలగిపోతాయని ధర్మశాస్త్ర వచనం. ఈ దినాన స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమా దేవిని పూజించి భుజిస్తారు. అట్ల తద్దికి ముందురోజును అట్లతద్ది భోగి అంటారు. ఆరోజు స్త్రీలు తలంటుకుని, కాళ్ళకు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారగట్లే లేచి చద్ది అన్నం గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసుతో భోజనం చేస్తారు. అప్పటినుంచి తెల్లవారే వరకు నిద్రపోరు. ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఊయలలు ఊగుతారు. ఇది చంద్రోదయ వ్రతం చంద్రుడు ఉదయించిన తరువాత గౌరిని కొలిచే వ్రతం. అయినా కొన్ని ప్రాంతాల్లో వైశ్య, బ్రాహ్మణుల ఇళ్లలో గౌరీపూజ అట్లతద్ది నాటి మధ్యాహ్నమే జరిపించడం ఆచా రంగా ఉంది. పది అట్లు నైవేద్యం పెట్టి, ముత్తైదువుకు 10 అట్లు వాయనం ఇచ్చి మధ్యాహ్నమే భోజనం చేస్తారు. రాత్రి ఫలహారం చేస్తారు. మిగతా కులాల్లో ఆచారం ఇందుకు భిన్నంగానూ, శాస్త్రీ యంగానూ ఉంది. వారు సాయంత్రం గౌరీ పూజ చేస్తారు. చంద్ర దర్శనం అయ్యాక భోజనం చేస్తారు. భక్తి శ్రద్ధలతో అట్లతద్ది నోము నోచుకుంటే కన్యలకు ముసలి మగడురాడు. పెళ్లి ఐన వాళ్లకు నిండు ఐదవతనం కలుగుతుందని విశ్వాసం. హరిభక్తుడు త్రిలోక సంచారి అయిన నారదుడు గౌరీదేవికి శివుని పతిగా పొందటానికి ఒక ఉపదేశం చేశాడు. గౌరీదేవి ఆనం దంతో శివుని పతిగా పొందాలని మొదటగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. అందుకే దీనికి ‘చంద్రోదయ గౌరీవ్రతం’ అనే పేరు వచ్చింది. దీనికి ఒక కథ వుంది. గౌరీదేవి భక్తురాలైన ‘సునామ’ అనే రాజకుమారి ద్వారా ఈ నోము భూలోకంలో ప్రాచుర్యాన్ని పొందింది. ‘సునామ’ పాటలీ పుత్రరాజు కుమార్తె. ఆమెకు యుక్తవయస్సు రాగానే వరునికై అన్వే షించాడు రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయిం చాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటు-న్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు- వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మ సిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి ”అదిగో చంద్రోదయమైంది. అమ్మా! కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో” అన్నాడు. రాజ కుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది కదా. తదియనాడు స్త్రీలు, గౌరీదేవిని ఆరాధించి పది అట్లు- నైవే ద్యంగా పెట్టి, పది అట్లు- వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టు-కుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో కలిసి పూజ అంతా యథా విథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. ”అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి ¸°వనవంతులైన భర్తలు లభిం చారు. నేనేమి అపచారం చేశాను? అంటూ దు:ఖించి పార్వతీ పరమే శ్వరులను ప్రార్థించింది. వారు ప్రత్యక్షమై ” నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త ¸°వన వంతుడవుతాడు” అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు ¸°వన వంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభి స్తాడు. వివాహితులు చేస్తే భర్త ఆయురారోగ్యాలతో ¸°వనంతో సుఖంగా వుంటాడు. ఈ నోము ను పది సంవత్సరాలు చేసి
ఉద్యాపన చేయాలి.

– సాయిరామ్‌
63005 64919

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News