Friday, October 22, 2021

గాయత్రీ కవచం అవతార విశేషాలు

”దేవీ! త్వం భక్త సులభే సర్వ కార్య విధాయిని కలౌ హి కార్యసిద్ధ్యర్థ ముపాయం, బ్రూహ యత్నత:”

పరమేశ్వరుడైన శివుని నోటినుండి వచ్చిన మాట.
అంటే ”ఓ! దేవీ! కార్యం సిద్ధించాలంటే, చేసే చిన్న ప్రయ త్నమైనా, చూసి, నీవు జయాన్ని కలిగిస్తావు. భక్తులకు సుల భంగా నీ దయ లభిస్తుంది” అని. ప్రస్తుతం శరన్నవరాత్రులు, జరుపుకొంటూ ఆ దుర్గమ్మ కరుణాకటాక్షాలకై తపిస్తుంటా ము. నేడు (9వతేదీ) అమ్మ వారు మనకు ”శ్రీ గాయత్రీ మాత” రూపంలో దర్శనమిస్తారు. ఆవిడే వేదమాత లేదా వేద గాయ త్రీ అని కూడా పిలవబడుతోంది.”గాయతాం త్రాయతే ఇది గాయత్రీ” అంటారు. దాని భావం గాయత్రిని జపించే వారిని తరింప చేస్తూ, సకల అభీష్టాలను నెరవేరుస్తుంటుంది. ఒకసారి నారద మహర్షి, ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళి, గాయత్రీ తత్త్వాన్ని తెలపమని కోరాడు. అప్పుడు బ్రహ్మ ”నా స్పురణ వల్ల, ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానం, వేదము అని చెప్పవచ్చు. ఆ శక్తి స్వరూపమే గాయత్రీ నామంతో వ్యవహరిస్తారు. గాయ త్రీలో వేదాలు, ఈ సృష్టి సమస్త క్రియలు నిక్షిప్తమై ఉన్నాయి.గాయత్రీ మంత్రాన్ని ఈ జగత్తుకు అందించిన బ్రహ్మర్షి శ్రీ విశ్వామిత్రుల వారు. ఋగ్వేదంలోని, వైశ్వామిత్ర మండ లంలో ఆయనే రాసాడు. ఆయన రాసిన విశ్వామిత్ర సంహత, స్మృతిలలో గాయత్రీని ఎలా ఆరాధించాలి, ఆ మంత్రంలో ఉన్న శక్తిస్వరూపాల గురించి వివరించారు. బ్రహ్మ నారదు డుకు వివరిస్తూ మంత్రంలోని నాలుగు పాదాలు కలిపి చదవ కూడదు. ఒక్కొక్క పాదం స్వరం దెబ్బ తినకుండా జపం చేయాలి. అందుకే ఉపనయన సంస్కార సమయంలో తొలి గురువుగా, గాయత్రీ మంత్రాన్ని తండ్రి,, వటువు చెవిలో స్వరంతో చెపుతాడు. ఇంకా అవసరమైతే గురువు వద్ద ముఖ తా: నేర్చుకోవాలి. నారదా! లోకంలో చాలామందికి గాయత్రీ మంత్రం గురించే తెలుసు. ఆమెకు ”కవచం” ఉంది. ఇది అత్యంత గోప్యమైన విషయం. దీనిని పఠించడంవల్ల, మాన వులు సకల పాపాల నుండి విముక్తులవుతారు. జ్ఞానం- ధర్మా చరణ వంటి సద్గుణాలు సిద్ధిస్తాయి. వాళ్ళ మనోభీష్టాలు సిద్దిస్తాయి.(ఈ గాయత్రీ కవచం శ్రీ దేవీభాగవతంలో సంస్కృ తంలోను, తెలుగు వచనంలోను ఉంది. పాఠకుల సౌలభ్యం కొరకు తెలుగు వచనంలో ఉన్నది పెడుతున్నాను.)
ఈ గాయత్రీ కవచానికి బ్రహ్మ- విష్ణువు- మహశ్వరుడు. ముగ్గురు ఋషులు. వేదాలు నాలుగు చంధస్సులు. పర బ్రహ్మము దేవత. తూర్పు దిశయందున్న గాయత్రీమాత నన్ను రక్షించుగాక. దక్షిణ దిశ యందున్న సావిత్రి, పశ్చిమ దిశ యందున్న బ్రహ్మ సంధ్య, ఉత్తరదిశ యందున్న భగవతీ స్వరూపిణి, సరస్వతీదేవి నన్ను రక్షించెదరుగాక. రాక్షసులకు భయాన్ని కలిగించే, రాక్షసుల దిక్కు నైఋతి నుండి, అగ్ని- జలము నందు వ్యాపించి ఉన్న, పార్వతి వాళ్ళకు భయాన్ని కలిగిస్తూ ఆగ్నేయ మూల నుండి, నా రక్షణ భారము స్వీకరిం చెదరుగాక. వాయువ్య దిశ కోణము నుండి, వాయువుకు ఆనందాన్ని కలిగించే దుర్గాదేవి, రుద్రరూపం ధరించిన భగ వతిగా ఈశాన్య కోణము నుండి నన్ను రక్షించెదరుగాక. బ్రహ్మణి ఉపరితలం నుండి, వైష్ణవీదేవి నిమ్నతలము నుండి నన్ను రక్షించెదరుగాక. ఈవిధముగా పది దిశల నుండి సంపూర్ణ అంగములను రక్షించు గాక. ఇక గాయత్రీమాత మంత్రంలోని పదాల సముదాయంలో ”తత్‌” పదము నా పాదములను, ”సవితు:” పదం నా తొడలను, ”వరేణ్యం” కటి ప్రదేశాన్ని ,”భర్గ:” నాభిని, ”దేవస్య” హృదయాన్ని, ”ధీమహ” రెండు చెక్కిళ్ళను, ”దియ:” మరియు ”వి” కారం రెండే నేత్రాలను, ”య:” లలాటాన్ని, ”న:” మస్తకాన్ని, సకా రం లలాటాన్ని, ”రే” కారం ముఖాన్ని, ”ణి ”కారము పై పెదవిని, ”య” కారము క్రింద పెదవిని, ”భ” కారం రేఫంతో కూడి, ముఖ మధ్యస్థాన్ని, ”గో” చుబుకాన్ని, ”దే” కారం కంఠమును, ”వ” కారము భుజములను, ”స్వ” కారం దక్షిణ హస్తాన్ని, ”ధీ” కారం ఎడమచేతిని , మ కారము హృదయా న్ని, ధీకారం నాభిని, ఒక ”యో” కారం నడుమును, రెండవ ”యో” కారము గుహ్య ప్రదేశాన్ని, ”న:” పదము రెండు ఊరువులను, ”ప్ర” కారము రెండు మోకాళ్ళను, ”చో” కార ము రెండు తొడలను, ”ద” కారము గుల్పములను, ”యా” కారము రెండు పాదములను, ”త” పదం అన్ని సర్వాంగము లను రక్షించునుగాక.” ఇలా గాయత్రీ మాత కవచాన్ని చదివితే సర్వ బాధలు తొలగి, సుఖసంపందలతో ఉంటారు.” ఈ కవచాన్ని పఠించినా, విన్నా విశేషమైన ఫలితాలను గాయ త్రీమాత కలిగిస్తుంది” బ్రహ్మ చెప్పగానే నారద మహర్షి సంతోషించి, లోకంలోని ప్రజలకు అందిస్తానని పలికాడు. వేదములను అభ్యసించాలంటే ”యజ్ఞోపవీత” ధారణ జర గాలి. గాయత్రీమాత కు సంధ్యాదేవి, సరస్వతీ, సావిత్రి, ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి. ఉదయం
అంటే ప్రాత:కాలంలో బాల్యావస్థలో, మధ్యాహ్న కాలంలో యవ్వనావస్థలో, సాయం సంధ్యా సమయంలో వృద్ధావస్థలో ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. త్రికాల సంధ్యావందనంలో ఉదయం గాయత్రీ, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతీ దేవిగా నామాలతో తేజస్సు తో చరిస్తూంటుంది.దేవీ నవరాత్రులలో గాయత్రీ రూపాన్ని చూపడంలో ప్రధాన ఉద్దేశ్యం ఆమె వేదమాత. యజ్ఞ, యాగాలకు, దేవతా రాధనకు, శాస్త్రీయ మార్గానికి ఆమె మార్గదర్శకురాలు. అందుకే మనం అందరం ఈ రోజు గాయత్రీ మాతను దర్శించి తలపోసి, తరిద్దాం ఆమె ఆశీస్సులు పొందుదాం.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News