Tuesday, October 26, 2021

కొనసాగుతున్న నిమజ్జనాలు

కొనసాగుతున్న నిమజ్జనాలు

హైదరాబాద్‌ మహానగరంలో గణేష్‌ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ఉత్సవాలకు దూరంగా ఉన్న భక్తులకు ఈ కరోనా తగ్గుముఖం పట్టడంతో గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని భక్తులు వైభవంగా జరుపుకున్నారు. నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవం ఈ రోజు రాత్రి వరకు కొనసాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టోల్‌ ఫ్రీ నెంబర్లతోపాటు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గణనాథులను తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌ వద్దకు జనం భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 90 శాతం నిమజ్జనాలు పూర్తి కాగా మిగతావి నేటితో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News