Friday, October 22, 2021

కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై కైవల్య ప్రదాత

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలరాయుని బ్రహ్మో త్సవాలతో సప్తగిరులు పులకిస్తున్నాయి. బ్రహ్మోత్స వాలలో నాలుగో రోజైన ఆదివారం శ్రీనివాసుడు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనాల పై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని రంగనాయకుల మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్పవృక్ష వాహ నంపై తలపాగా, జాటితో గోవుల గోపన్నగా కోరినకోర్కెలు తీర్చే కల్పవృక్షం పై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండవరోజు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తం గా జరిగింది. మొదటిసారిగా జాజిపత్రి,పిస్తా,కర్జూరం ,ఎం డుద్రాక్షతో రూపొందించిన మాలలు, కిరీటాలతో తిరుమం జనం శాస్త్రోక్తంగా జరిగింది. పలు రకాల సుగంధ ద్రవ్యా లతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి ప్రత్యేక మాలలను అలంకరించారు. తిరుమంజనం జరిగే రంగనాయకుల మం డపాన్ని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో ఆకర్షణీ యంగా, సర్వాంగసుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు జరిగే గరుడ సేవలో స్వామివారికి అలంక రించేదుకు చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా ఆదివారం తిరుమలకు తీసుకు వచ్చి ఆలయం ముందు టీటీడీ అధికారులు అప్పజెప్పారు. అలాగే గరుడసేవలో స్వామివారికి అలంక రించేందకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు కూడా తిరుమలకు చేరుకున్నాయి. అనంతరం మాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాల లను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్ళారు. ఇక రాత్రి సప్తగిరీశుడు సర్వభూపాల వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు.. ఇక ఐదవ రోజైన నేడు ఉదయం స్వామివారు మోహిని అవతారంలో రాత్రి శ్రీనివాసుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనం పై దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో జీయంగార్లు, టిటిడి చైర్మె న్‌, ఈవో, అదనపు ఈవో, బోర్డు సభ్యులు, సివిఎస్వో, ఆలయ డిప్యూటిఈవో,అర్చకులు, పేష్కార్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News