Sunday, January 19, 2025

కనకదుర్గమ్మ సేవలో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని నీతి అయోగ్‌ జాతీయ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ దర్శించుకున్నారు. శ్రీదుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం ఆలయానికి వచ్చిన ఆయనకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జీ.వాణీమోహన్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి డీ.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగం పలి కారు. అనంతరం రాజీవ్‌ కుమార్‌తో పాటు ఆలయానికి వచ్చిన ఏడుగురు అధికా రులు శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం ఆల య ప్రధాన అర్చకులు, వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా, ఉన్నతా ధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement