Tuesday, May 18, 2021

ఆత్మ అవగాహన (ఆడియోతో…)

ఆత్మిక స్థితి చాలా అద్భుతమైన మానసిక స్థితి. అందులో స్వ స్మృతి పూర్తిగా భౌతిక ఉనికి నుండి ఆత్మిక స్థితి వైపుకు మరలి ఉంటుంది. ఆత్మిక స్థితిలో నిన్ను ఒక స్త్రీ లేక పురుషిడిగా, తెల్ల జాతి లేక నల్ల జాతివాడిని అని కూడా భావించనవసరం లేదు. నీ ఆత్మ గౌరవము ప్రాపంచిక ప్రాప్తులపై ఆధారపడి ఉండదు. నేను భగవంతుని సంతానమును అన్న అంతర్గత యోగ్యతా భావము నీలోని ఆత్మ గౌరవానికి ఆధారమవుతుంది.

ఆత్మిక స్థితి లేనప్పుడు నీ బాగోగులు వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తులు మరియు పరిస్థితుల ప్రభావాలకు బానిస అవుతావు – వాతావరణం, వ్యక్తులు మంచిగా ఉన్నప్పుడే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇటువంటి ఆధారము ఆత్మను బలహీనంగా చేసి గందరగోళ స్థితిలో పడవేస్తుంది. ఆత్మిక స్థితి నిన్ను బాహ్య ప్రభావాల నుండి విముక్తి చేసి స్వతంత్రమైన ఆంతరిక ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది.

నిరంతర అభ్యాసం ద్వారానే ఆత్మిక స్థితి వీలవుతుంది. ఇటువంటి సత్యమైన, ఆంతరిక, ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకున్నవారే ఈ కృషిని చేస్తారు. స్వ ఉన్నతిని, నీకున్న పట్టుదలను పరీక్షించడానికి కష్టాలు తప్పకుండా వస్తాయి.- అనారోగ్యము, సంబంధాలు, గత స్మృతులు…. అయినప్పటికీ సహనముతో, ఆత్మ పరిశీలనతో చూసినప్పుడు ఈ పరీక్షలన్నీ నీ ఆత్మ ఉనికిని శక్తిమంతం చేయడానికే అని నీకు అర్థమవుతుంది.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Prabha News