Monday, December 4, 2023

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : ధర్మావతి
విభుని వినయములు

విభుని వినయములు వినవమ్మా నిను
నభయం బడిగీ నయ్యో తాను || విభుని వినయములు ||

- Advertisement -
   

రహస్యమున శ్రీ రమణుడు పంపిన
విహరణ లేకలు వినవమ్మా
అహిపతి శయనంబతి తాపంబై
బహువేదన కగపడెనట తాను || విభుని వినయములు ||

ఆదిమపతి నీయడుగుల కెరగిన –
వేదాంత రచన వినవమ్మా
నీదయగానక నిమిషమె యుగమై
ఖేదంబున నలగీనట తాను || విభుని వినయములు ||

కింకరుడట నీకినుక సేతలకు
వేంకటపతిగతి వినవమ్మా
సంకెలేక నీచనవున జగములు
కొంకకిపుడె చేకొనెనట తాను || విభుని వినయములు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement