Wednesday, April 14, 2021

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : తోడి
సుగ్రీవ నారసింహ

సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి
అగ్రేసరుడ నీరు అవధారు దేవ || సుగ్రీవ నారసింహ ||

సనకాదులొకవంక జయవెట్టుచున్నారు
ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు
మును లిరుమేలానుండి మునుకొని నుతించేరు
అనుపమాలంకార అవధారు దేవ || సుగ్రీవ నారసింహ ||

గంగాది నదులెట్ల కడిగీ నీ పాదములు
పొంగుచు సప్తరుషులు పూజించేరు
సంగతి వాయుదేవుడు సరినాలవట్టమిడీ
అంగజ కోటిరూప అవధారు దేవా || సుగ్రీవ నారసింహ ||

పరగ నారదాదులు పాడేరు నీ చరిత
పరమ యోగీంద్రులు భావించేరు
సిరులు మించినయట్టి శ్రీ వేంకటాద్రి మీద
అరుదుగ నున్నాడవు అవధారు దేవ || సుగ్రీవ నారసింహ ||

Advertisement

తాజా వార్తలు

Prabha News