Wednesday, June 16, 2021

అన్నమయ్య కీర్తనలు : రంగరంగ రంగపతి

రాగం : సింధుభైరవి
రంగ రంగ రంగపతి రంగనాథా – నీ
సింగారాలె తరచాయ శ్రీరంగనాథా || ||రంగరంగ రంగపతి||
పట్టపగలేమాతో పలచగ నవ్వేవు
ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథా
వట్టి మాకు లిగిరించువడి నీ మాటలు వి ంటే
రట్టడివిమేర మీరకు రంగనాథా || ||రంగరంగ రంగపతి||
కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి
రావు పోవు ఎక్కడికి రంగనాథా – శ్రీ
వేంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి
ఏవల చూచిన నీవే ఇటు రంగనాథా || ||రంగరంగ రంగపతి||

Advertisement

తాజా వార్తలు

Prabha News