Sunday, June 20, 2021

అన్నమయ్య కీర్తనలు : మాధవకేశవ

రాగం : కాపీ
మాధవా కేశవా మధుసూదనా విష్ణు
శ్రీధరా పదనఖం చింతయామి యూయం || ||మాధవకేశవ||
వామన గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న
రామరామకృష్ణ నారాయణాచ్యుత
దామోదరానిరుద్ధ దైవపుండరీకాకక్ష
నామత్రయాధీశ నమో నమో || ||మాధవకేశవ||
పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య
హరి సంకర్షణా అధోక్షజా
నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమా
శరణాగత రక్ష జయజయ సేవే || ||మాధవకేశవ||
మహిత జనార్థనా మత్స్యకూర్మ వరాహ
సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం
అహమిహ తవపదదాస్యం అనిశం భజామి || ||మాధవకేశవ||

Advertisement

తాజా వార్తలు

Prabha News