Wednesday, June 23, 2021

అన్నమయ్య కీర్తనలు : నవరసములదీ నళినాక్షీ

నవరసములదీ నళినాక్షీ
జవగట్టి నీకు జవిసేసీ || ||నవరసములదీ నళినాక్షీ||

శృంగారరసము చెలియమొకంబున
సంగతి వీరరసము గోళ్ల
రంగగు కరుణరసము పెదవులను
అంగపు కుచముల నద్భుతరసము || ||నవరసములదీ నళినాక్షీ||

చెలిహాస్యరసము సెలవుల నిండి
పలుచని నగుమున భయరసము
కలికి వాడి కన్నుల బీభత్సరసము
అలబొమ జంకెనల అదె రౌద్రంబు || ||నవరసములదీ నళినాక్షీ||

సతిరతి మరపుల శాంతసంబదె
అతిమోహము పతియవ రసము
ఇతవుగ శ్రీవేంటేశ గూడితివి
సతమై యీమెకు సంతోషరసము || ||నవరసములదీ నళినాక్షీ||

Advertisement

తాజా వార్తలు

Prabha News