Saturday, July 24, 2021

అన్నమయ్య కీర్తనలు : ఓ పవనాత్మజ

రాగం : శ్రీరాగం

ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగ పరగితిగా || ఓ పవనాత్మజ ||

ఓ హనుమంతుడ ఉదయాచల ని
ర్వాహక నిజసర్వప్రబలా
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహమిటువలె చాటితిగా || ఓ పవనాత్మజ ||

ఓ రవి గ్రహణ ఓ దనుజాంతక
మారులేక మతి మలసితిగా
దారుణపు వినతా తనయాదులు
గారవింపనిటు కలిగితిగా || ఓ పవనాత్మజ ||

ఓ దశముఖహర ఓ వేంకటపతి
పాదసరోరుహ పాలకుడా
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీ దేహమెక్కనిలిచితిగా || ఓ పవనాత్మజ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News