Thursday, July 29, 2021

అన్నమయ్య కీర్తనలు : ఐన దేది కాని

రాగం : నారాయణదేశాక్షి
ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుడె కాక ||ఐన||

యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
మెవ్వరు స్వతంత్రు లిందులో
అవ్వల నివ్వల నంతరాత్ముడైన
యవ్వనజాక్షుని ననుట గాకా ||ఐన||

యెందుకు గోపించే మెందుకు మెచ్చే
మెందు గద్దు మే లిందులో
అందు నిందు దానె యల్లుకొన్న
నందనందనునే నమ్ముట గాకా ||ఐన||

యేచోటు మంచిది యోచోటు చెడ్డది
యేచోటు సతమౌ నిందులో
కాచేటి శ్రీవెంకటనాథుడై
చేచేత గాణాచై చెల్లించె గాకా ||ఐన||

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News