Saturday, July 24, 2021

అన్నమయ్య కీర్తనలు : ఏమని పొగడవచ్చు

రాగం : హిందోళ
ఏమని పొగడవచ్చునీతని ప్రభావము
వేమరువో పుణ్యలాల వినరో యీకతలు || ఏమని ||

అనంత సూర్యతేజుడట కాంతి చెప్పనంత
దనుజాంతకుండట ప్రతాపమెంత
మనసిజగురుడట మరిచక్కదనమెంత
వనజజు గనినయట్టి వాడట ఘనతెంత || ఏమని ||

గంగాజనకుడట కడు చెప్పే పుణ్యమెంత
చెంగట భూకాంతడట సింగారమెంత
రంగగు లక్ష్మీశుడట రాజసము లెంచనె ంత
అంగమించు సర్వేశుడట సంపదెంత || ఏమని ||

మాయానాథుడట మహిమ వచించుటెంత
యేయెడ దావిష్ణుడట యిరవెంత
పాయక శ్రీ వేంకటాద్రి పతియై వరములిచ్చే
వేయిరూపుల వాడట విస్తారమెంత || ఏమని ||

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News