Monday, January 17, 2022

అన్నమయ్య కీర్తనలు : అంగనకునీవే

రాగం : కానడ

ప|| అంగనకు నీవే అఖిలసామ్రాజ్యము
శృంగార రాయ నీకు శ్రీసతి నిధానము ||

చ|| కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగ పొదరిల్లు
రమణీయ హారాలు రతనాల మేడలు ||

చ|| సతికినీ మెడరతి సాముసేసే కంబము
ప్రతి లేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీ వత్సము మించు బండారు ముద్ర ||

చ|| నెమ్మి నలమేల్మంగ నీకాగిలి పెళ్లిపీట
చిమ్ముల చందన చర్చ సేసపాలు
వుమ్మడి మెడసూళ్ళూ ఉయ్యాల సరపణులు
పమ్మి శ్రీ వేంకటేశ నీ భావమే భాగ్యము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News