Sunday, October 17, 2021

అన్నపూర్ణ అవతారంలో రాజశ్యామల అమ్మవారు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆదివారం నాలుగో రోజు రాజశ్యామల అమ్మ వారు అన్నపూర్ణ అవతారంలో దర్శనమిచ్చారు. ఓ చేతితో గరిట, మరో చేతితో అన్నపాత్ర చేతపట్టి భక్తులకు జ్ఞాన భిక్షను ప్రసాదిస్తున్నట్లు- అమ్మవారి అలంకరణను తీర్చిదిద్దారు. అన్నపూర్ణ అవతారంలో ఉన్న రాజశ్యా మల అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టు-కుంది. అన్నపూర్ణ అవతారానికి విశాఖ శారదా పీఠాధి పతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి హారతులిచ్చి, పూజలు చేశారు. అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారి నిజరూపానికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. విశాఖ శారదాపీఠం చేపట్టిన శత చండీయాగం శాస్త్రో క్తంగా కొనసాగుతోంది. మరోపక్క వేద పండితులు వనదుర్గ మహావిద్య పారాయణ చేపట్టారు. రాజశ్యామల అమ్మ వారి మూలవిరాట్‌ వద్ద శ్రీ చక్రానికి నవావరణ అర్చన కొనసాగుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సా పురానికి చెందిన డాక్టర్‌ ధూళిపాళ ప్రభాకర్‌ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీమత్‌ దేవీ భాగవత పారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News