Thursday, April 25, 2024

ఈ నెల 31న రీలీజ్​ కానున్న ‘విడుత‌లై’.. డిజిటల్ రైట్స్ ను భారీ ద‌ర‌కు సొంతం చేసుకున్న ZEE‌‌–5

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సంచలన దర్శకుల్లో వెట్రిమాన్ ఒకరు. వడ చెన్నై, అసురన్ వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ తీసిన అతను ‘విడుతలై’ అనే కొత్త మూవీతో వస్తున్నాడు. పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ మూవీ ఫ్రాంచైజీ నుంచి మొదటి భాగం ఈ నెల చివరిన‌ (మార్చి 31న) థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా నుంచి ఈ మధ్యనే విడుదల అయిన ప్రమోషనల్​ పిక్స్​, ట్రైలర్ వంటివి సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ పోస్ట్ థియేట్రిక‌ల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE–5 భారీ ధరకు ద‌క్కించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, శరవణ సుబ్బయ్య, భవానిశ్రీ వంటివారు కీలక రోల్స్​లో నటిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకి ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ & గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement