Saturday, April 20, 2024

శింబు తో ‘తప్పు చేశాను’ అనిపిస్తున్న యువన్ శంకర్ రాజా

తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శింబు. తన తండ్రి టి రాజేందర్ అడుగుజాడల్లో నడుస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు శింబు. అయితే తాజాగా శింబు ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియో లో భాగం అయ్యాడు.  ఎ. కె. ప్రియన్  సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ యువన్ శంకర్ రాజా యు1 రికార్డ్స్ బ్యానర్ లో స్నేహితులతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నారు.

అయితే ఈ పాటను శింబు తో పాడిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను యువన్ శంకర్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కోరిక మేరకు ఈ పాట శింబు పాడుతున్నారని ఈ మ్యూజిక్ వీడియోకు తప్పు పనితెన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement