Friday, June 18, 2021

సంజయ్ లీల బన్సాలీతో యంగ్ టైగర్ సినిమా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు తారక్.

కాగా తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తోపాటు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా తారక్ అభిమానులు ఆ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News