Friday, April 19, 2024

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకున్న యంగ్ టైగర్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల ప్రమోషన్ లో భాగంగా దోస్తీ అనే వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ బాధ్యతలను తనపై వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే ఆర్ ఆర్ ఆర్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను రాబోయే పది రోజుల పాటు తన హ్యాండోవర్ లోకి తీసుకుంటున్నారట ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ ఆర్ ఆర్ ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రమోషన్స్ చేయనున్నారు.

https://www.instagram.com/p/CSULMPRMDMa/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement