Thursday, April 18, 2024

వరుణ్ కు అడ్డుతగులుతున్న ప్రభాస్

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది థియేటర్లు, షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అనుమతులు రావడంతో సినిమాలన్నీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లను ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా జూలై 30న విడుదల కాబోతోంది. ఇక అదే రోజు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా గని కూడా విడుదల కాబోతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాధే శ్యామ్ డేట్ ఫిక్స్ అయితే గని రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్ 3 కూడా వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే పరోక్షంగా ప్రభాస్ వరుణ్ తేజ్ రెండు సినిమాలకు అడ్డంకిగా మారాడు. మరి దర్శకనిర్మాతలు వరుణ్ సినిమా రిలీజ్ డేట్ పై మార్పులు చేస్తారో లేదో చూడాలి. గని విషయానికొస్తే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement