Tuesday, March 26, 2024

మిస్ శెట్టి..మిస్ట‌ర్ పోలిశెట్టి నుండి.. హ‌త‌విధీ సాంగ్

స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా వస్తోంది మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి. ద‌ర్శ‌కుడు పి.మహేష్ బాబు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా ఫోటోగ్రఫి అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క చెఫ్ గా కనిపిస్తుంటే.. హీరో నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాట ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. హతవిధీ అంటూ సాగె ఈ పాటను స్టార్ హీరో ధనుష్ ఆలపించారు. బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం మాత్రమే ఉంది. బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో నటించిన అనుష్క.. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement