Thursday, April 25, 2024

పవన్ పై ట్రోల్స్… వివాదంలోకి రేణు ని కూడా లాగిన వైసీపీ

వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళల గురించి కాసేపు ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే స్త్రీ ఒక శక్తి అంటూ మహిళలను పొగడ్తలతో ముంచెత్తారు. వకీల్ సాబ్ సినిమాలో మహిళల తరఫున న్యాయవాదిగా వాదించటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసిపి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో రేణు దేశాయ్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ను జత చేస్తూ పవన్ పై ఈ ట్రోల్స్ చేస్తున్నారు. 11 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితం త‌ర్వాత ఇద్ద‌రు చిన్న పిల్ల‌లున్న‌ప్పుడు… నా నుండి ప‌వ‌న్ విడాకులు కావాల‌ని అడిగారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హిళా అభిమానులు బాధ‌ప‌డి ఉండొచ్చు… కానీ నా ప్లేసులో మీరుండి ఆలోచించండి. భార్య ఉండగా త‌న‌కు తెలియ‌కుండా మ‌రో మ‌హిళ‌తో సంబంధం పెట్టుకొని, బిడ్డకు జ‌న్మ‌నిస్తే మీకు ఎలా ఉంటుంది అంటూ రేణు ఆ వీడియోలో అప్పుడు మాట్లాడారు.

వ్యక్తిగత జీవితం గురించి పెట్టడం నిజంగా ఇష్టం లేదు. దయచేసి క్షమించండి. ఇంట్లో ఒక అక్కలా రేణు గారంటే గౌరవం ఉంది. మనం ఎవరు పర్ఫెక్ట్ కాదు.. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయ్ మళ్ళీ మనం సర్దుకుంటాం.. ముందుకు వెళతాం.. కానీ, మహిళజాతి మొత్తాన్నే ఉద్దరించేస్తునట్లు మాట్లాడుతుంటే పెట్టాల్సి వచ్చింది క్షేమించండి అంటూ వైసీపీ అభిమానులు పోస్ట్ లో పేర్కొన్నారు.

https://www.facebook.com/watch/?v=793470128238699

Advertisement

తాజా వార్తలు

Advertisement