Friday, April 19, 2024

39 కోట్లతో యాక్షన్ సీన్ – తగ్గేదేలే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడట.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ సీన్ కోసం దాదాపు 39 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఇప్పటికే ఖర్చు విషయంలో తగ్గేదే లేదని నిర్మాతలు కూడా సుకుమార్ కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 13న ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement