Wednesday, April 17, 2024

‘లియో’కి, ఎల్‌సీయూకి లింక్ ఉంటుందా?.. విజయ్​ మూవీపై సినీ లవర్స్​ ఎగ్జయిట్​మెంట్​

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ని సెట్ చేసిన సినిమా విజయ్ థలపతి “లియో”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు. నిన్ననే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టైటిల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు భారీ రెస్పాన్స్ వస్తోంది.

అయితే.. ఈ సినిమా టైటిల్ పెట్టిన తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎలా లింకప్ అయ్యి ఉంటుంది అనే అంశాలు మూవీ లవర్స్ లో ఆసక్తిగా మారాయి. ఈ సినిమాలో విజయ్ రోల్ ని ఓ బేకరీలో చూపించగా దానిని ఖైదీలో కార్తీ రోల్ కి లింకప్ చేస్తూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

అలాగే.. మరోపక్క ఈ తరహా మాఫియా చిత్రాల్లో కొన్ని కోడ్స్ ఉంటాయని అదే విధంగా విక్రమ్ లో రోలెక్స్ కి చూపించిన తేలు గుర్తు ఇప్పుడు లియో గా పిలిచే పేర్లు ఉంటాయని అన్నిటిలో ‘లియో’ అందరికి బాస్ లా ఉంటాడు అన్నట్టుగా రకరకాల ఇంట్రెస్టింగ్ థియరీలు ఇపుడు వినిపిస్తున్నాయి. అయితే క్రేజీ డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​ మాత్రం దీన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ థియరీలకు పుల్​స్టాప్​ పడాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement