Wednesday, April 24, 2024

పవన్ లెక్చరర్ గా ఆడియన్స్ కి క్లాస్ పీకుతాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు హరీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ 28వ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ లో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఇక ఈ సినిమాలో స్టూడెంట్ కి లెక్చరర్ గా ఆడియన్స్ కి ఇండైరెక్ట్ గా క్లాస్ పీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇక పవన్ కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. మరి లెక్చరర్ గా పవన్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement