Thursday, April 25, 2024

మహేష్ గుణశేఖర్ ల ప్రతాపరుద్రుడు…స్టార్ట్ అవుతుందా ?

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా…గుణశేఖర్ తో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రతాపరుద్రుడు అనే టైటిల్ తో మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని టాక్ నడిచింది. కాగా ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హిరణ్యకసిప సినిమా చేయబోతున్నాడు.

ఆ తర్వాత ప్రతాపరుద్రుడు ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రతాపరుద్రుడు కథ పై పూర్తి స్థాయిలో స్థాయిలో కసరత్తు చేశాడట గుణశేఖర్. గతంలో గుణశేఖర్ మహేష్ బాబు ఒక్కడు సినిమా చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే పౌరాణిక సినిమాలపై మహేష్ పెద్దగా ఆసక్తి చూపించాడు. మరి ఈ ప్రాజెక్టుకు ఓకే చేస్తాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement