Thursday, April 18, 2024

ఆచార్య రిలీజ్ అవ్వదా ?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దసరా , దీపావళి , సంక్రాంతి బరిలోకి స్టార్స్ సినిమాలు బెర్తులు ఖరారు చేసుకోగా ..ఆచార్య మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement