Thursday, April 18, 2024

టాప్ హీరోలకు పోటీగా నారప్ప…బరిలో గెలిచేది ఎవరు ?

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

కానీ ఆ సమయానికి పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా చాలామంది రేస్ లో నిలిచారు. అయితే ఈ సినిమా మాత్రం… సంక్రాంతి కే ఉందని వెంకటేష్ క్లారిటీ ఇచ్చాడు. నారప్ప సక్సెస్ మీట్ లో వెంకీ ఈ విషయం తెలిపాడు. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement