Thursday, April 25, 2024

శంకర్ చరణ్ లకు సరితూగే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కావడానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం క్యాస్ట్ మరియు టెక్నికల్ టీం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సంగీతం విషయంలో అనిరుద్, థమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా థమన్ పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి చూడాలి శంకర్ ఏం ఆలోచిస్తున్నారనేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement