Thursday, April 25, 2024

ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఎవరు ? అధికారిక ప్రకటన వచ్చేదెప్పుడో!!

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ వైషయమై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ కియారా ఈ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ నడిచింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. కియారా అద్వానీ ఇటీవల నెటిజన్స్ తో చిట్ చాట్ చేస్తూ మరో తెలుగు సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా పూజా హెగ్డే పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నారట. కాగా వీరిలో ఎవరిని కొరటాల సెలెక్ట్ చేశారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement