Friday, March 29, 2024

మాస్ట్రో కు ఇంకో వారం సరిపోయేది !!

బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ మూవీ అంధాధూన్ రీమేక్ మాస్ట్రో సినిమాను నితిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. అలాగే ఓ కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కాగా వీలైనంత తొందరగా షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇంకో వారం రోజులు షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఈ కరోనా మహమ్మారి దాపరించింది. లేదంటే మాస్ట్రో షూటింగ్ కు ఈ పాటికే శుభం కార్డు పడేది.నితిన్ కెరీర్ లోనే ఒక ప్రయోగాత్మకంగా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement