Tuesday, April 23, 2024

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఎక్కడ ?

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రేపు తారక్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ఆల్రెడీ రెడీ గా ఉందట. కానీ చిత్ర యూనిట్ మాత్రం అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఎనౌన్స్మెంట్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ అనౌన్స్మెంట్ ఈరోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం అభిమానులు మాత్రం తారక్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement