Wednesday, April 24, 2024

అధికారిక ప్రకటన ఎప్పుడు ?@ టక్ జగదీష్

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

కాగా ఇప్పుడు ఈ సినిమా జూలై 30న రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. దీంతో అభిమానులు సందిగ్దంలో పడ్డారు. అలాగే రిలీజ్ పై సరైన క్లారిటీ కూడా కోరుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement