Saturday, April 20, 2024

జాతి రత్నం కోసం స్లిమ్ అవ్వలేను – అనుష్క ?

అక్కినేని నాగార్జున హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అనుష్క శెట్టి. ఆ తర్వాత సినిమా సినిమాకు పైకి ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ… లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అదరగొట్టింది. అయితే ప్రస్తుతం జాతి రత్నాలు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి తో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రారా కృష్ణయ్య ఫేం మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 20 ఏళ్ల యువకుడు, అతడి కంటే 10 ఏళ్ల పెద్దదైన మహిళ మధ్య జరిగే ప్రేమకథే ఈ సినిమా. అయితే ఈ సినిమా కోసం స్లిమ్ గా మారాలని దర్శక నిర్మాతలు చెప్పారట. కానీ స్వీటీ మాత్రం అందుకు నో చెప్పిందని తెలుస్తుంది. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కోసం నవీన్ పోలిశెట్టి పేరును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సూచించినట్టు గా కూడా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement