Sunday, May 9, 2021

బన్నీ తో డాన్స్ చేసేది నేనే …దిశా పటాని

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ కరోనా బారిన పడడంతో ఈ షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేశాడు. ఆ ఐటమ్ సాంగ్ లో దిశాపటాని చిందులు వేయనుందట. ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన దిశాపటాని బన్నీతో డాన్స్ చేయబోతున్న విషయాన్ని చెప్పేసింది.

ఇటీవల రాధే సినిమాలో సిటీ మార్ సాంగ్ కు దిశా డాన్స్ చేసింది. అలాగే బన్నీ హృతిక్ తనకు నచ్చిన డాన్సింగ్ హీరోలు అని బన్నీ మూమెంట్స్ మామూలుగా ఉండదని అలా వైకుంఠపురములోని బుట్ట బొమ్మ పాట తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News