Tuesday, April 16, 2024

క‌థ గురించి నేనేం చెప్ప‌ను.. డైరెక్ట‌ర్ ని అడ‌గండి.. ర‌వితేజ‌

డైరెక్టర్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా, కథ నచ్చితే సినిమా చేయడానికి తాను వెనుకాడననే మాట వాస్తవమే అన్నారు హీరో ర‌వితేజ‌. స్వామి రారా సినిమా చూసినప్పుడే సుధీర్ వర్మతో సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇంతకాలానికి మేం ఇద్దరు చేయగలిగే కథ కుదిరింది. అందుకే రావ‌ణాసుర మూవీని చేశాన‌న్నారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పమని ద‌ర్శ‌కుడు హరీశ్ శంకర్ అడిగితే ఫన్ .. ఫన్ గా మాట్లాడుకుందామని అన్నావు … అలాగే మాట్లాడుకుందాం. నేనైతే కథను గురించి ఏమీ చెప్పను. నా పక్కనే ఉన్న సుశాంత్ ను కూడా ఏమీ చెప్పనివ్వను. సుధీర్ వర్మ ద్వారా ట్రై చేస్తానంటే ట్రై చేయి అన్నారు ర‌వితేజ‌.ఈ సినిమాకు రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రవితేజ, ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన సుశాంత్ ను కలిపి, దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement