Friday, April 19, 2024

పవన్ సినిమాలో వివి వినాయక్ ?

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.

వివి వినాయక్ పాత్ర పవన్ తో పాటు రానా పాత్ర కూడా దగ్గరగా ఉండేదిగా కనిపిస్తుందట. ఇక ఇప్పటికే వినాయక చాలా సినిమాల్లో నటించారు. ఇటీవల శీనయ్య సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. మరి పవన్ సినిమాలో ఎలాంటి మాస్ పాత్రలో వి.వి.వినాయక్ కనిపిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement