Thursday, April 18, 2024

యాక్ష‌న్ కింగ్ డైరెక్ష‌న్‌లో విశ్వ‌క్‌సేన్‌.. మూవీపై అప్‌డేట్ ఇచ్చిన టీమ్‌

రీసెంట్‌గా అశోకవ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు యువ హీరో మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్. కాగా త‌న త‌దుప‌రి మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ ఇచ్చేశాడు ఈ యువ హీరో. యాక్ష‌న్ కింగ్‌ అర్జున్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న‌ట్టు వెల్ల‌డించాడు విశ్వ‌క్.. అయితే ఈ సినిమాకి అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టం విశేషం.

అర్జున్ హోంబ్యాన‌ర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ పై ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. అర్జున్ ఇప్ప‌టికే తెలుగులో స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో జైహింద్ 2ను తెర‌కెక్కిస్తుండ‌గా.. డైరెక్ట‌ర్‌గా తెలుగులో ఇది రెండో సినిమా. ఇంట్రెస్టింగ్ విష‌యమేంటంటే అర్జున్ కూతురు ఐశ్వ‌ర్యా అర్జున్ ఈ సినిమాతో తొలిసారి తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

- Advertisement -

కాగా.. మేక‌ర్స్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్ర‌క‌టించారు. విశ్వ‌క్ సేన్ 11వ ప్రాజెక్టుగా వ‌స్తున్న ఈ మూవీలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలపై స్ప‌ష్ట‌త రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement