Thursday, March 28, 2024

విశ్వక్ సేన్ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడోచ్ !!

యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఫలక్నుమాదాస్, ఈ నగరానికి ఏమైంది,హిట్ వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు ఫలక్నుమాదాస్ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈరోజు ఇంస్టాగ్రామ్ లో ఫలక్నుమాదాస్ ముహూర్తం వేడుక కు సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. 3 సంవత్సరాల క్రితం ఫలక్నుమాదాస్ ముహూర్తం షాట్ నిన్నటి లా అనిపిస్తుంది అంటూ ల్ పోస్ట్ పెట్టారు.

అలాగే ఈ పోస్ట్ లోనే ఫలక్నుమా దాస్ 2 కోసం చిత్రబృందం త్వరలో మళ్ళీ కలుస్తుందని చెప్పారు. నిజానికి ఈ సినిమా మలయాళం హిట్ మూవీ అంగమలీ డైరీస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే అంగమలీ డైరీస్ కు సీక్వెల్ రాలేదు. కానీ ఫలక్నుమాదాస్ కోసం చిత్రబృందం రెడీ అవుతోంది. ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement