Thursday, April 25, 2024

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో విశ్వక్ సేన్ ?

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లను రాయటంలో రైటర్ ప్రసన్నకు మంచి పేరు ఉంది. అయితే ప్రసన్న కుమార్, నక్కిన త్రినాథరావు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సినిమాకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ప్రసన్న కుమార్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం స్క్రిప్ట్ ను సిద్దం చేశాడట. విశ్వక్ కి కూడా ఆ స్క్రిప్ట్ వినిపించాడట. అది విన్న విశ్వక్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే అందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారట. ఇక ఈ సినిమాకి కూడా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ప్రసన్నకు అలాగే త్రినాథరావు కు బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు విశ్వక్. ఈ కొత్త సినిమాకు సంబంధించి మరి కొన్ని వివరాలు తెలియాల్సి. ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement