Thursday, April 25, 2024

వెంకీ కుడుములతో వైష్ణవ్ తేజ్ ?

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం వెంకీ కుడుముల కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వైష్ణవ్. భీష్మ సినిమా హిట్ తర్వాత వెంకీ కుడుముల ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఇక నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. నితిన్ కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. మొదట వెంకీ వరుణ్ తో సినిమా చేయాలనుకున్నారు.కానీ అనుకున్న సమయానికి గని పూర్తికాకపోవడం వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. వరుణ్ తేజ్ సినిమా పూర్తయ్యేలోగా, వైష్ణవ్ తేజ్ తో చేయడానికి వెంకీ కుడుముల రంగంలోకి దిగాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement