Thursday, March 28, 2024

కరోనా ఎఫెక్ట్: విరాటపర్వం వాయిదా..

కరోనా సెకండ్‌ వేవ్‌ మరింతగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఆ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడుతోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో విరాటపర్వం చిత్రం విడుదల వాయిదా పడింది. కోవిడ్ నేపథ్యంలో చిత్రం వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. థియేటర్ లోకి జనాలు వందల మంది వస్తే అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే కాస్త తగ్గుముఖం పట్టేంత వరకు వెచి ఉండాలని సినిమా మేకర్స్ నిర్ణయించుకుంటున్నారు. అందులో భాగంగా…అందులో భాగంగానే తమ సినిమా విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే లవ్‌స్టోరి, టక్‌ జగదీష్…సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సాయిపల్లవి, రానా నటించిన విరాటపర్వం కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 30న విడుదల …కావాల్సిన సినిమాని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది.

నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో సినిమా రూపొందుతోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమంగా సినిమా రిలీజ్‌లు వెనక్కి వెళుతున్నాయి. ఇప్పటికే ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన లవ్‌స్టోరి, ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన టక్‌ జగదీష్‌ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు వీటి సరసన విరాటపర్వం కూడా చేరింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement