Sunday, June 13, 2021

బన్నీ కోసం మనం డైరెక్టర్ ?

గతేడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురము లో సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. అలాగే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా పుష్ప రాజ్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి.

తాజాగా ఇంటిలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. విక్రమ్ కె కుమార్ బన్నీ కోసం ఒక స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విక్రమ్ కె కుమార్ గతంలో మనం ,24 వంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News