Friday, April 26, 2024

జూన్​ 3న వస్తున్న విక్రమ్​.. అభిమానులకు కనువిందు చేయనున్న పొలిటికల్​ యాక్షన్​ థ్రిల్లర్​..

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. పాత్రలను ఎంచుకోవడంలో కమల్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ఒక కథతోనే ఆయన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయారు. ఆయన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. లోకేష్‌ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్న‌డు. ‘ఖైదీ’ ‘మాస్టర్’ సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు(మే 20) సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్‌ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందించారు. జూన్‌ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement