Tuesday, March 26, 2024

సీవీఎల్‌ నరసింహారావుకు విజయశాంతి సపోర్ట్

మా అసోసియేషన్ ఎన్నికల బరిలో ఈసారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఈ నలుగురు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా సీవీఎల్ నరసింహారావు కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా సీనియర్ నటి, బిజెపి మహిళా నేత విజయశాంతి నరసింహారావు కు మద్దతుగా నిలిచారు. విజయశాంతి మాట్లాడుతూ… నేను మా సభ్యురాలిని కాకపోయినప్పటికీ ఒక నటిగా ఆ విషయంపై స్పందిస్తున్నాను. సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైనది… అంటూ చెప్పుకొచ్చారు విజయశాంతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement