Wednesday, April 24, 2024

ఎన్బీకే 108.. విజ‌య‌ద‌శ‌మికి ఆయుధ‌పూజ‌

హీరో బాల‌కృష్ణ‌తో ఎన్బీకే 108వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. ఇందులో కాజల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని చెప్పారు మేక‌ర్స్. దసరా కానుకగా బాలయ్య సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. విజయదశమికి ఆయుధపూజ అంటూ పోస్టర్‌ ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య పవర్‌ ఫుల్‌ లుక్‌ని విడుదల చేశారు. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్‌ సైతం ఆకట్టుకుంటుంది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బాలయ్య కూడా తెలంగాణ స్లాంగ్‌లోనే మాట్లాడబోతున్నారట. బాలకృష్ణ మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో, దర్శకుడు అనిల్‌ రావిపూడి మార్క్ వినోదం మేళవింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement